అనుపమ ప్రేమ, బ్రేకప్ వివాదం: ధ్రువ్ విక్రమ్ క్లారిటీ!
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నటుడు ధ్రువ్ విక్రమ్‌ల మధ్య బ్రేకప్ వివాదం నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీరి రిలేషన్ చుట్టూ తిరుగుతున్న ఊహాగానాలు.. అనుపమ చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ధ్రువ్ విక్రమ్ తనపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ట్రోలింగ్ పై మౌనం వీడి స్పందించిన తీరు ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్.. తాను గత రెండేళ్లుగా ఓ తీవ్రమైన టాక్సిక్ రిలేషన్ షిప్‌లో ఉన్నానని.. ఆ బంధంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయితే ఆమె ఎక్కడా ఎవరి పేరును నేరుగా వెల్లడించకపోయినప్పటికీ.. అంతకు ముందు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి నటించిన రోజుల్లో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, సోషల్ మీడియా పోస్టులను ఆధారంగా చేసుకుని నెటిజన్లు ఆ కామెంట్స్ ధ్రువ్ విక్రమ్‌ను ఉద్దేశించినవేనని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు.

ఈ తరహా విమర్శలపై ధ్రువ్ విక్రమ్ స్పందిస్తూ.. సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి విమర్శలు సర్వసాధారణమని పేర్కొన్నాడు. ఈ రంగం ఎంత అందమైనదో.. ఇందులో అలాంటి భిన్నమైన కోణాలు కూడా ఉంటాయని, వాటిని స్వీకరించక తప్పదని చెప్పాడు. అయితే ఇలాంటి వార్తలు తనను అసలు ప్రభావితం చెప్పలేదని చెప్పలేనని.. కానీ వాస్తవంలో నిలదొక్కుకుంటూ మనం ప్రేమించే వారిని, మన విలువలను కాపాడుకోవడం ముఖ్యమని ధ్రువ్ విక్రమ్ తెలిపాడు.
ధ్రువ్ విక్రమ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అనుపమ చెప్పిన ఓ వైపు కథను మాత్రమే విని ధ్రువ్‌ను అహంకారిగా, టాక్సిక్ వ్యక్తిగా చిత్రీకరించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం అనుపమ పడిన మానసిక వేదనను సమర్థిస్తున్నారు. ధ్రువ్ విక్రమ్ నేరుగా బ్రేకప్ పై ఏమీ మాట్లాడకపోయినప్పటికీ.. ఆయన ఇచ్చిన సమాధానం అనుపమ చేసిన ఆరోపణలకు పరోక్ష ప్రత్యుత్తరంగానే విశ్లేషకులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications