AP El Nino: ఎల్ నినో తీవ్రం.! ఇక నీళ్లూ కష్టమే- అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్..!
ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పు ఎల్ నినో (AP El Nino) ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. దీనికి ఏపీ కూడా మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్ధితులపై ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన అంగీకరించారు. దీని వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపిస్తోందని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ వేదికగా ఎల్ నినో విషయమై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడు-కర్ణాటక మధ్య జరుగుతున్న వివాదంలో సుప్రీం కూడా జోక్యం చేసుకుందని ఆయన గుర్తుచేశారు. గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా నీటి సమస్యలు వస్తున్నాయన్నారు. 2026 జూన్-డిసెంబర్ వరకు 867 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే కేవలం 557 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదవుతుందని ఓ అంచనా అని వెల్లడించారు.

ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని సీఎం తెలిపారు. కొన్ని జిల్లాల్లో జులై నెలలో 68 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఆగస్టు నెలలో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్‌లో 25 శాతం, నవంబర్‌లో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందన్నారు. డిసెంబర్ నెలలో మాత్రం 1 శాతం అదనపు వర్షపాతం నమోదవుతుందన్నారు. వివిధ బేసిన్లల్లో జలాలు తగ్గిపోతున్నాయని, ప్రాజెక్టులు, రిజర్వాయర్లల్లో నీటి పట్టాలు పడిపోతున్నాయని చంద్రబాబు తెలిపారు. శ్రీశైలానికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే.. ఈసారి 214 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. రాష్ట్రానికి నీళ్లు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తాయని, వాళ్ల రిజర్వాయర్లు నిండిన తర్వాతే మనకు నీళ్లు వస్తాయన్నారు. దీని వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీరు తక్కువగా వస్తోందని, గోదావరి బేసిన్లో కూడా జలాల లభ్యత తక్కువగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications