అత్తారింట్లో నవ వధువు ఇంత పని చేసిందేంటి..? పెళ్లైన వారానికే..
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాలతో చాలా మంది జంటలు విడిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య.. అటు భార్యకు తెలియకుండా భర్త చాటుగా ఎఫైర్లు నడిపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి భారతీయ వివాహ వ్యవస్థను ఈ తరం వాళ్లు భ్రష్టు పట్టిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన జరిగింది. ఆగ్రాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవాస్ వికాస్ కాలనీలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పెళ్లి అయిన వారానికే కొత్త పెళ్లి కూతురు అత్తింటివారికి బిగ్ షాక్ ఇచ్చింది. మీడియేటర్ల మాటలు నమ్మి తన పెద్ద కుమారుడికి వివాహం జరిపించింది ఓ వితంతువు. ఆ నవ వధువు పెళ్లి అయిన వారానికే ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో జంప్ అయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితులైన కుటుంబం న్యాయస్థానం ద్వారా సికంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..?
ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని సికంద్రా ప్రాంతానికి చెందిన గుడ్డి దేవి వితంతువు. ఆమెకు విష్ణు అనే కుమారుడు ఉన్నాడు. అయితే విష్ణుకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. షంషాబాద్ కు చెందిన జవహర్ సింగ్ అనే మధ్యవర్తి ప్రయాగ్ రాజ్ కు చెందిన ప్రీతి అనే యువతితో వివాహాన్ని ప్రతిపాదించాడు. ప్రీతి అనాథ, పేద కుటుంబానికి చెందిన యువతిగా చెప్పాడు. ఇక పెళ్లి సమయంలో ఖర్చుల కోసం రూ. 1.5 లక్షల డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుటుంబం రూ. 1 లక్ష నగదు రూపంలో చెల్లించింది. రూ. 50,500 ఆన్ లైన్ ద్వారా బదిలీ చేసింది. ఈ మేరకు జూన్ 27న ఇంట్లో వివాహం జరిగింది. ఆ తర్వాత మీడియేటర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ మేరకు జూలై 3న తెల్లవారుజామున అత్త గుడ్డి దేవి నిద్రలేచి చూడగా కోడలు కనిపించలేదు. విచారణలో ఆమె రూ. 4 లక్షలకు పైగా విలువైన వస్తువులను దొంగిలించినట్లు తేలింది. అందులో మంగళసూత్రం, లాకెట్, ఉంగరాలు, గొలుసు తదితర వస్తువులను దొంగిలించినట్లు తేలింది. ఆమెను ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications