తెలంగాణ BJPకి కొత్త సారధి- ఆయనకే పగ్గాలు, హైకమాండ్ బిగ్ ప్లాన్..!?
బీజేపీ నాయకత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. మోదీ 4.0 లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ సారి తెలంగాణ పైన భారీ ప్లాన్ తో సిద్దం అవుతున్న బీజేపీ అధినాయకత్వం కీలక మార్పుల దిశగా కసరత్తు చేస్తోంది. త్వరలోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుకు సమాయత్తం అవుతోంది. తెలంగాణలో బీజేపీ కొత్త స్కెచ్ సిద్దం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకత్వమే నేరుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆపరేషన్ తెలంగాణ అమలుకు నిర్ణయించింది.
తెలంగాణ కేంద్రంగా కొత్త నిర్ణయాలకు బీజేపీ అధినాయకత్వం సిద్దం అవుతోంది. అందులో భాగంగా జనవరిలో రాష్ట్ర పార్టీ బాధ్యతలు మార్పు ఉంటుందని పార్టీలో ముఖ్య నేతల మధ్య చర్చ కొనసాగుతోంది. 2028 లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పైన ఈ సారి బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. హర్యానా, పశ్చిమ బెంగాల్ లో అమలు చేసిన ఫార్ములాతో తెలంగాణ లో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఇందు కోసం తాజాగా ఇంఛార్జ్ లను నియమించింది. ఇక, పార్టీ నేతల మధ్య సమన్వయం పైనా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ సమయంలోనే ఆరెస్సెస్ నేత లు సైతం తెలంగాణలో పరిస్థితుల పైన బీజేపీ నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత చీఫ్ రామచంద్రరావు కు తటస్థులు, జెన్ జీ ని పార్టీ వైపు తిప్పే బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో దిగనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కొత్త వ్యూహాన్ని సిద్దం చేస్తోంది.

తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలు
ఇక, గత అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి పెరిగిన సీట్లు.. ఓట్లతో వచ్చే ఎన్నికల కోసం ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే కలిసి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో, పార్టీ అధ్యక్ష బాధ్యతలు తిరిగి బండి సంజయ్ కు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. బండి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ లో జోష్ పెంచటంతో పాటుగా గ్రేటర్ లో దాదాపు 50 మంది కార్పోరేటర్లను గెలిపించుకున్నారనే అంశం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. పార్టీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్ సైతం తెలంగాణ పైన ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం. అమిత్ షా సహా.. కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. జనవరిలో తెలంగాణ కేంద్రంగా బీజేపీ నాయకత్వం కీలక మార్పులు.. నిర్ణయాలతో సిద్దం అవుతున్న వేళ... రాజకీయంగా ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
