వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!

తిరుమలలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్‌ (పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్)ను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది టీటీడీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఈ సెంటర్‌ ఏర్పాటైంది. దీనిపై శుక్రవారం మీడియా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్నీ సందర్శించారు.

ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిల్లో ఒకటి.. ఈ పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌. దీన్ని దుర్లభ్ దర్శనం అనే సంస్థ రూపొందించింది. క్షేత్రస్థాయి పరిశీలిన అనంతరం మీడియా ప్రతినిధులు పద్మావతి అతిథి గృహంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలో సమావేశం అయ్యారు. ఈ రెండింటి గురించి మీడియా అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Field Visit Showcases New VQC Pilgrim Experience Centre Queue Complex-1 and Modernised SV Museum at Tirumala

క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణాలు, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలు తదితరాలను 3డీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించడానికి ఈ సెంటర్ ను వినియోగించనున్నట్లు తెలిపారు. భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయం నిరీక్షణగా కాకుండా, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి అనుకూలంగా మార్చాలన్నదే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఏపీలో ఉలుకుపలుకు లేని కాంగ్రెస్.. !!
ఏపీలో ఉలుకుపలుకు లేని కాంగ్రెస్.. !!

ఇప్పటికే దుర్లభ్ దర్శనం సంస్థ వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను రూపొందించిందని, భారీస్థాయిలో భక్తులను ఆకట్టుకునేలా ఈ సాంకేతికతను ఎలా వినియోగించాలన్న అంశంపై మరింత కృషి చేస్తోన్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. భవిష్యత్తులో స్వామివారికి సంబంధించిన కథలు, భక్తుల అనుభవాలు, తిరుమల కొండ విశిష్టత, ఆలయ చరిత్ర, నిర్మాణం, పరిపాలన, సేవలు, పురాణాలు, దాతలు తదితర అంశాలపై నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో నిరంతరం కొత్త కంటెంట్ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని అదనపు ఈవో తెలిపారు. పురాణాలు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం, స్వామివారి సేవలు, భక్తుల కథలు, ఆలయ నిర్మాణం, చరిత్ర, పరిపాలన, దాతల సేవలు తదితర అంశాలపై విభిన్న కథనాలను ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దీంతో భక్తులు దర్శనానికి వెళ్లే ముందు స్వామివారు, తిరుమల ఆలయం, ఇక్కడి సంప్రదాయాలు, సేవలు, చరిత్ర గురించి మరింత తెలుసుకుని ఆధ్యాత్మిక పరిపూర్ణత, సంతృప్తితో దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుందని వెంకయ్య చౌదరి తెలిపారు. డిజిటల్ కంటెంట్‌తో పాటు తిరుమల ఆలయ చరిత్ర, వారసత్వం, పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులను సమగ్రంగా ప్రదర్శించే విధంగా మ్యూజియంను ఆధునీకరించినట్లు వివరించారు.

దాదాపు 14 గ్యాలరీల్లో ప్రత్యేకమైన థీమ్‌తో మ్యూజియాన్ని తీర్చిదిద్దామని, ఆలయ సంప్రదాయం, వారసత్వానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. మ్యూజియం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక మాన్యువల్‌ను రూపొందిస్తున్నామని, ఇందులో సీసీ కెమెరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, గైడ్ల సేవలు, భద్రతా చర్యలు తదితర అంశాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. మ్యూజియంను ఎస్ఓపీ ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+