విజయ్ ప్రభుత్వంలో ఏపీ గూఢచారులు? 15 మందిపై వేటు.! అందులో ముగ్గురు..!

పెట్టుబడుల ఆకర్షణ విషయంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఏపీ-తమిళనాడు మధ్య మరింత గట్టి పోటీ నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఏపీకి పెట్టుబడులకు సంబంధించిన రహస్యాలను లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విజయ్ (Vijay) సర్కార్ వారిపై కొరడా ఝళిపించింది. దీంతో వీరిలో ముగ్గురు ఏపీ సర్కార్ లోకి వచ్చి నేరుగా చేరిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ సర్కార్ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వ్యవహారాన్ని హిందుస్దాన్ టైమ్స్ తాజాగా బయటపెట్టింది.

తాజాగా విశాఖలో సీఐఐ పెట్టుబడుల సదస్సు జరిగింది. ఇందులో తమిళనాడుకు వెళ్లాల్సిన దక్షిణ కొరియాకు చెందిన దాదాపు 1400 కోట్ల విలువైైన రెండు సంస్ధల్ని ఏపీ తన్నుకుపోయింది. వీటిని అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు సర్కార్ లో కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపించిన సీఎం విజయ్.. 15 మంది ఉద్యోగుల్ని బాధ్యులుగా గుర్తించారు. అయితే వీరంతా తాత్కాలిక ఉద్యోగులే కావడంతో వీరిపై వెంటనే వేటు వేశారు. దీంతో ఇందులో ముగ్గురు నేరుగా ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆర్ధిక అభివృద్ది మండలి (APEDB)లో వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు తమిళ పత్రికలు ప్రచురించాయి. వీరు ఈడీబీలో చేరినట్లు సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పెట్టుకున్నట్లు కూడా అవి నివేదించాయి.

Vijay removes 15 Employees Over Alleged Leak of Tamil Nadu Investment Secrets to Andhra Pradesh

ఇప్పటికే తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడుల్ని ఏపీ తన్నుకుపోతోందని, అయినా విజయ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అక్కడి విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వీటిని ఇన్నాళ్లూ ఖండిస్తూ వస్తున్న విజయ్ సర్కార్.. ఈ వ్యవహారంలో మాత్రం దొరికిపోయింది. దీంతో వెంటనే ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ద్వారా నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయినా ఈ దుమారం ఆగేలా కనిపించడం లేదు. అదే సమయంలో ఏపీ సర్కార్ తరఫున తమిళనాడు ప్రభుత్వానికి ఉప్పందించిన ఆ ముగ్గురు ఉద్యోగుల్ని.. అక్కడ తొలగించగానే ఏపీ ఈడీబీ ఎలా నేరుగా చేర్చుకుందన్న దానిపైనా చర్చ జరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా స్పందిస్తే తప్ప అసలు గుట్టువీడేలా కనిపించడ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+