రామ్ పోతినేని 'RAPO23' మూవీ ప్రీ-లుక్ రిలీజ్.. సోషల్ మీడియా షేక్..

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన కెరీర్ లోనే అతిపెద్ద సాహసానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు తొలిసారిగా కథ రాసి, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న 'RAPO23' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.ఇది రామ్ కెరీర్​ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది.

ఇందులో రామ్​ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌ పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా, నియో- నోయిర్ శైలిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే మంచి ఆసక్తి నెలకొంది.

అయితే ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా రామ్ పోతినేని.. ఈ మూవీ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ ఓల్ఫ్ అనే క్యాప్షన్‌ తో వచ్చిన ఈ పోస్టర్‌ లో రామ్ తనదైన శైలిలో, కొత్త లుక్‌ తో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.

RamPothineni RAPO23 gone viral On the occasion of Men Day the prelook Tollywood energetic hero

ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ మూవీ టీజర్, టైటిల్ త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రేజీ ఈ ప్రాజెక్ట్‌ కు సామ్ సీ.ఎస్. సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ ముఖ్ విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ మూవీతో రామ్ పోతినేని తన స్వీయ దర్శకత్వంతో హిట్ కొడతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+