ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్ లో రీఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుడి మోకాలి భాగానికి మళ్లీ గాయం కావడంతో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. క్రికెట్ కు దూరం కానున్నాడు. ఈ తాజా గాయం దెబ్బకు అక్టోబర్‌లో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటన మొత్తానికీ హార్దిక్ దూరం కావడం దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా- ఏ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు కూడా.

అక్టోబర్ 6వ తేదీ నుంచి ఆస్ట్రేలియా ఎ జట్టుతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం సెలక్టర్లు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు కూడా. ఈ సిరీస్ తో మళ్లీ గాడిన పడతాడని ఆశించారు. ఈ సిరీస్ కోసం అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ప్రాక్టీస్ లో కూడా క్రమం తప్పకుండా పాల్గొంటోన్నాడు. అదే అతని తాజా గాయానికి దారి తీసింది. కుడి మోకాలులో నొప్పి తలెత్తింది. దీంతో అతనికి స్కానింగ్ నిర్వహించగా గాయం తీవ్రత బయటపడింది. చిన్నపాటి ఫ్రాక్చర్ ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం.

Hardik Pandya Suffers Fresh Right Shin Injury Out of Australia A New Zealand White-Ball Tour India

దీంతో అతనికి రెండు నుంచి మూడు వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. ఆసియా గేమ్స్ లో భాగంగా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ ప్యానెల్ చీఫ్ డాక్టర్ దిన్షా పార్దివాలా ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే హార్దిక్ మెడికల్ రిపోర్టులను నిశితంగా పరిశీలిస్తారని, హార్దిక్ కు ఎప్పటి నుంచి రిహాబిలిటేషన్ అవసరం అనేది ఖరారు చేస్తారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది.

ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని
ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ అక్టోబర్ 22వ తేదీన ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ ఉంటుంది. ఈ లోగా హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. ఆసియా గేమ్స్ లో భాగంగా జపాన్ తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ కు కూడా అతను అందుబాటులో లేని విషయం తెలిసిందే. మొదట హార్దిక్ పాస్‌పోర్టు తీసుకుని వీసా ప్రక్రియను కూడా బీసీసీఐ పూర్తి చేసింది. మోకాలి నొప్పి తిరగబెట్టడం అటు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కూ దూరం అయ్యాడు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!

గత నాలుగు నెలల కాలంలో హార్దిక్ పాండ్యా ఇలా గాయాల బారిన పడటం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఆఫ్ఘనిస్థాన్ వన్డేలు, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌తో పాటు ఇప్పుడు ఆస్ట్రేలియా ఎ జట్టుతో మ్యాచ్‌లకు కూడా అతను దూరం కావాల్సి వచ్చింది. ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి బెంగళూరునే నివాసంగా మార్చుకుని ఆయన ముమ్మరంగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్ సాధించే క్రమంలో పదే పదే పాత గాయాలు తిరగబెట్టడం ఈ ఆల్‌రౌండర్‌కు కొత్త సవాలుగా మారింది.

న్యూజిలాండ్ పర్యటన కూడా చేజారే పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడక తప్పని పరిస్థితి ఏర్పడినట్టయింది. ఒకవేళ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందే తన సత్తా నిరూపించుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జింబాబ్వే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+