ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని

ఐక్యరాజ్యసమితి 81వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడంతో పాటు ఈ రెండు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలు విషయంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రసంగం మొత్తం కూడా దాదాపుగా ఉద్రిక్తతలను మరింత పెంచేలా సాగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సింధు నదీ జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ షెహబాజ్ షరీఫ్ భారత్‌కు ప్రత్యక్షంగా హెచ్చరికలు చేశారు. తమకు దక్కాల్సిన నదీ జలాల వాటాను అడ్డుకోవడం గానీ, దారి మళ్లించే ప్రయత్నం చేస్తే దానిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, యుద్ధంగానే భావిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో భారత్ ఎటువంటి పొరపాటు చేయకూడదని అన్నారు. నీటి వనరుల పంపిణీ విషయంలో తమ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Shehbaz Sharif says in UNGA Any Attempt to Stop Pakistan s Water Share Will Be Treated as an Act of War

ఐక్యరాజ్యసమితి వేదికగా కాశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని తన పాత రాగాన్నే మళ్లీ అందుకున్నారు. కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైన ప్రాంతమని అభివర్ణించారు. అక్కడి ప్రజల స్వీయ నియంత్రణ హక్కు లభించే వరకు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కాశ్మీరీ ప్రజలకు దౌత్యపరంగా, రాజకీయంగా, నైతికంగా తమ దేశం నుంచి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని షెహబాజ్ షరీఫ్ అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో స్పష్టం చేశారు.

మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్
మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

భారత్ నుండి ఎదురైన సైనిక సవాళ్లను ఎదుర్కొనడానికి ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ప్రకారం తమకు లభించిన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకున్నట్లు షరీఫ్ పేర్కొన్నారు. తమ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వంలో తమ సైన్యం శత్రువులకు గట్టి బుద్ధి చెప్పిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకోకుంటే దక్షిణాసియాలో అణు యుద్ధ ముప్పు సంభవించేదని, ఆయన జోక్యం వల్లే కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని వాదించారు.

పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్
పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్

యుద్ధం కంటే శాంతి మార్గంలో సాగే చర్చల ద్వారానే ప్రపంచంలో తలెత్తే సమస్యలకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని షెహబాజ్ షరీఫ్ హితవు పలికారు. హింస కంటే సహకారం, ఘర్షణల కంటే సంప్రదింపులే తమ ప్రాధాన్యతని చెబుతూనే.. ఆయన ప్రసంగం మొత్తం కూడా భారత్‌పై ఆరోపణలతోనే సాగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, పాలస్తీనాలో మానవత సహాయం వంటి అంతర్జాతీయ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం, అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెరుగుతున్న అప్పులు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వ్యాపిస్తున్న ఉగ్రవాద ముప్పును గురించి కూడా ప్రస్తావించారాయన. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, చర్చలను ప్రోత్సహించడానికి బలమైన అంతర్జాతీయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పొరుగు దేశమైన భారత్‌తో శాంతియుత సంబంధాల కంటే వివాదాలనే హైలైట్ చేయడం ఆయన ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనిపించింది.

పాక్ ప్రధాని చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై భారత దౌత్య వర్గాలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో ఒక అవిభాజ్యమైన అంతర్భాగమని, దాని అంతర్గత విషయాల్లో ఏ దేశం జోక్యం చేసుకోలేదని భారత్ ఎన్నోసార్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ జరిపే ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా ఆగినప్పుడే ద్వైపాక్షిక చర్చలు సాధ్యమవుతాయని భారత్ మొదటి నుండి కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో షరీఫ్ వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+