మీరొక కీలుబొమ్మ: ఐరాసలో పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్

ఐక్యరాజ్యసమితి 81వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడంతో పాటు ఈ రెండు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలు విషయంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రసంగం మొత్తం కూడా దాదాపుగా ఉద్రిక్తతలను మరింత పెంచేలా సాగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సింధు నదీ జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ షెహబాజ్ షరీఫ్ భారత్‌కు ప్రత్యక్షంగా హెచ్చరికలు చేశారు. తమకు దక్కాల్సిన నదీ జలాల వాటాను అడ్డుకోవడం గానీ, దారి మళ్లించే ప్రయత్నం చేస్తే దానిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, యుద్ధంగానే భావిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో భారత్ ఎటువంటి పొరపాటు చేయకూడదని అన్నారు. నీటి వనరుల పంపిణీ విషయంలో తమ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

India Slams Pakistan PM Speech in UNGA Right of Reply Says Remarks Were Bizarre and Form 47 Claim

దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఐక్యరాజ్యసమితిలోనే పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. షెహబాజ్ షరీఫ్ చేసిన ఈ ప్రకటనలను ఐరాసలో భారత ప్రతినిధి, పర్మనెంట్ మిషన్ ఫస్ట్ సెక్రెటరీ పెటల్ గెహ్లాట్ తిప్పికొట్టారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం నామమాత్రమేనని, అది పూర్తిగా సైన్యం కనుసన్నల్లో నడిచే ఓ కీలుబొమ్మ ప్రభుత్వమని ఎండగట్టారు. షెహబాజ్ షరీఫ్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆమె మాట్లాడారు. దీనికోసం తన రైట్ ఆఫ్ రిప్లై హక్కును ఉపయోగించుకున్నారు. పాక్ ద్వంద్వ విధానాలను ప్రపంచం ముందుంచారు.

ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని
ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని

ప్రపంచాన్ని వణికించిన 9/11 ఉగ్రదాడులను గుర్తు చేశారు పెటల్ గెహ్లాట్. ఆ దాడి సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర పాకిస్తాన్‌దేనని తూర్పారబట్టారు. సైనిక అకాడమీకి కూతవేటు దూరంలోనే అతను ఏళ్ల తరబడి ఎలా తలదాచుకున్నాడో ప్రపంచానికి తెలుసునని చురకలు అంటించారు. పాకిస్తాన్‌లో ప్రస్తుత పాలనను అక్కడి ప్రజలే అంగీకరించట్లేదని, ఫామ్ 47 ప్రభుత్వంగా భావిస్తోన్నారని ఎద్దేవా చేశారు.

ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌
ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌

2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి, ప్రజా తీర్పును తారుమారు చేయడం ద్వారా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పడిందనే ఆరోపణలను ఆమె ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. పాక్ ఎన్నికల సంఘం తుది ధ్రువీకరణకు ముందు ఉపయోగించే ఫామ్ 47 డాక్యుమెంట్లను మాలిప్యులేట్ చేసి ఆర్మీ అండతో అధికారంలోకి వచ్చారనే విమర్శలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఇకపై..!!

పాకిస్థాన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ప్రస్తుత పాలకులకు లేదని పెటల్ గెహ్లాట్ తేల్చి చెప్పారు. అక్కడ ప్రస్తుతం నడుస్తున్నది "సైన్యం, సైన్యం ద్వారా, సైన్యం కోసం.." సాగుతున్న పాలన అని తప్పుపట్టారు. ముఖాలకు ముసుగులు మారినా, దేశ భవిష్యత్తును శాసించేది మాత్రం సైన్యమేనని పేర్కొన్నారు. ఒకవైపు ఉగ్రదాడికి వ్యూహాలు రచిస్తూ, మరోవైపు శాంతి వచనాలు పలకడం పాక్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

జమ్మూ కాశ్మీర్ విషయమై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను పెటల్ ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అవిభాజ్య అంతర్భాగమని పునరుద్ఘాటించారు. కాశ్మీర్ అంశంపై మాట్లాడాలనుకుంటే ముందుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు చూడాలని అన్నారు. మతదూషణ చట్టాలను ఆసరాగా చేసుకుని సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాలరాస్తున్న పాకిస్తాన్‌కు ఇతర దేశాల గురించి మాట్లాడే అర్హత లేదని తెగేసి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+