కుప్పకూలిన మిలటరీ విమానం. 14 మంది మృతి
ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సిన ఆ విమానం ఒక్కసారిగా నేలకూలింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో) దేశంలో చోటుచేసుకున్న ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు అత్యున్నత స్థాయి మిలిటరీ అధికారులతో పాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశ సైన్యంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ పెను ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో దేశ సైన్యానికి చెందిన కీలక వ్యక్తులు ఉండటం గమనార్హం. మిలిటరీ కోర్టు ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటాలయ్ టియెండే, సాయుధ బలగాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఈ దుర్ఘటనలో దుర్మరణం చెందారు. వీరు కాక విమానంలో ప్రయాణిస్తున్న మిగతా ప్రతినిధులు, విమాన సిబ్బంది సహా మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారని ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే ధృవీకరించారు.
రాజధానికి వస్తుండగా సాంకేతిక లోపం
సౌత్‌వెస్ట్ కాంగోలోని కిక్విట్ ప్రాంతం నుంచి దేశ రాజధాని కిన్షాసాకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గమధ్యంలో విమానంలో అకస్మాత్తుగా తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తిందని స్థానిక అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే లోపే విమానం కెంజ్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. విమానం కూలిన ప్రాంతమంతా విడిభాగాలు, శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
#BREAKING A plane crash in Congo killed 14 people, including top military officials Lt. Gen. Mutombo Katalayi Tiende and Lt. Gen. Bakumi Likulia, following a technical fault near Kenge.#CongoPlaneCrash #DRCongo #BreakingNews #MilitaryCrash #WorldNews pic.twitter.com/6NqC7Zb4QT
— jarvis ☠️ (@Vishii14) September 26, 2026
అసలు ఈ ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రిఫాన్ కిన్-కియ్ ములుంబా వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. విమానం టెక్నికల్ కండిషన్ ఎలా ఉంది, చివరి క్షణాల్లో ఏం జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా, ఒకవైపు కాంగో తూర్పు ప్రాంతంలో ఆర్మీకి, పలు సాయుధ రెబెల్ గ్రూపులకు మధ్య తీవ్ర పోరు సాగుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.














Click it and Unblock the Notifications
