Jana Nayagan OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి 'జన నాయగన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ మూవీ అనేక సార్లు వాయిదాలు పడి ఎట్టకేలకు జూలై 23 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అటు తెలుగులోనూ 'జన నాయకుడు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ చివరి సినిమా కావడంతో టాక్ తో సంబంధం లేకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సృష్టించింది. రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి విజయ్ స్టామినా ఏంటో చాటింది. అలా తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న విజయ్ జన నాయగన్ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్లాఫ్ టాక్ కు మాత్రమే పరిమితమైంది.

అయితే జన నాయగన్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. నెల రోజులు తిరగక ముందే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. ఆగస్టు 21 న జీ 5 వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ అధికారిక ప్రకటనను జీ 5 తెలియజేస్తూ ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. జన నాయగన్ చిత్రాన్ని హెచ్‌. వినోద్‌ తెరకెక్కించారు.

Vijay Jana Nayagan heads to OTT streaming date fixed streaming on Zee5 from August 21 Vijay movie

ఈ మూవీలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. నిజానికి ఈ మూవీ ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ నుంచి సమస్యలు కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత విజయ్ సీఎం అయ్యాక ఎట్టకేలకు జూలై 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఈ మూవీ ఓటీటీలోకి రానుండటంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే జన నాయగన్ హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+