వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతి నుంచి బాబు ప్రచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ ఎన్నికల ప్రచారానికితెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ఈ నెల 30వ తేదీన తిరుపతిలోశ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు తిరుపతి, గుంటూరుజిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లోఆయనపాల్గొంటారు. జులై 1వ తేదీన రాయలసీమలోనూ, 2వ తేదీన తెలంగాణాలోనూఆయన ప్రచారం చేస్తారు.

ప్రధాన ప్రతిపక్షమైనకాంగ్రెస్‌ జులై 1వ తేదీన మెదక్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్నికొనసాగించునుంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిసంయుక్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకపోవడంతో బిజెపి ప్రచార కార్యక్రమాన్ని ఇంకా ఖరారుచేసుకోలేదు. బిజెపి 145 నుంచి 150 జడ్‌పిటిసిలనుఆశిస్తుండగా 110 నుంచి 120 వరకు ఇచ్చేందుకుతెలుగుదేశం సుముఖత వ్యక్తంచేస్తోంది. శుక్రవారంనాటికి చర్చలు ఒక కొలిక్కివస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయఅన్నారు. తెలుగుదేశంతో కలిసి ప్రచారం

చేయాలా, వద్దా అనే విషయంలో ఇంకా ఏనిర్ణయమూ తీసుకోలేదని ఆయన చెప్పారు.తెలుగుదేశం, బిజెపిల త్రిసభ్యసమన్వయ కమిటీ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందనిఆయన చెప్పారు.

వామపక్షాలతో అవగాహనతోకాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈఅవగాహన జాతీయ స్థాయిలో కూడా ఏర్పడగలదనిసత్యనారాయణరావు ఆశించారు. ప్రత్యేక తెలంగాణా ప్రభావం తమపార్టీపై ఈ ఎన్నికల్లో కొద్దిగా ప్రభావం వేస్తుందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X