మమతకు బిగ్ షాక్.. ఆ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు..

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే బెంగాల్ లోని ఫాల్తా నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. దాంతో అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మే 21 న ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు ఈసీ తేల్చింది. ఏప్రిల్ 29 ఈ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ లో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిందని, డెడ్ లాక్ వంటి పరిస్థితులు తలెత్తాయని ఈసీ స్పష్టం చేసింది.

ముఖ్యంగా ఈవీఎంలపై కొన్ని పార్టీల గుర్తులకు టేపులు వేయడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం అలాగే ఓటర్లను ప్రలోభపెట్టినట్లు 77 ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. ఒక్క ఫాల్తా నియోజకవర్గం నుంచే 32 ఫిర్యాదులు అందినట్లు వివరించింది. అయితే ఫాల్తాతో పాటు డైమండ్ హర్బర్, మగ్రాహత్ పశ్చిమ నియోజకవర్గాల్లోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించి మే 2 న అక్కడ పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఇక ఈ నిర్ణయం బెంగాల్ లో సంచలనంగా మారింది. ఈసీ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడింది.

EC Directs Re-Polling in Falta Bengal Fresh Voting to Be Held in This Constituency Falta repolling

ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. మే 4 న బెంగాల్ లోని అన్ని నియోజకవర్గాలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. కానీ ఫాల్తా నియోజకవర్గానికి మాత్రం మే 21 న రీ పోలింగ్ జరిగిన తర్వాతనే ఫలితం వెల్లడి కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+