IPL 2026: హార్దిక్ చెత్త బ్యాటింగ్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్..

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలతో పాయింట్స్‌ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్పా ముంబై ఇండియన్స్ టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయంతో తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4 విజయాలు, 5 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచినా సీఎస్‌కే‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.

Hardik Pandya s Sluggish Knock Proves Costly as CSK Eliminate Mumbai Indians from IPL 2026

చెలరేగిన రుతురాజ్, కార్తీక్ శర్మ

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/32) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.

అనంతరం సీఎస్‌కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 నాటౌట్), కార్తీక్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఉర్విల్ పటేల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) దూకుడుగా ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, అల్లా ఘజన్‌ఫర్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

కొంపముంచిన హార్దిక్ జిడ్డు బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణమైంది. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుకు నష్టం చేశాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ 18 పరుగులే చేశాడు. సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(5), విల్ జాక్స్(1) వైఫల్యం కూడా ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. హార్దిక్ దూకుడుగా ఆడినా.. సూర్య, తిలక్ వర్మలో ఒక్కరు రాణించినా ముంబై ఇండియన్స్ 180-190 పరుగులు చేసేది. అప్పుడు ముంబైకి గెలిచే అవకాశం ఉండేది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+