సైబరాబాద్‌లో హైటెక్స్ సిటీ
హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌ను మరిపించే విధంగా హైదరాబాద్‌లో వివిధ రకాలైన పారిశ్రామిక ప్రదర్శనలకు శాశ్వత వేదికగా బృహత్ ట్రేడ్ ఫెయిర్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఎక్స్‌పొజిషన్ సెంటర్ లిమిటెడ్ (హైటెక్స్ సిటీ) పేరుతో ఏర్పాటవుతున్న ఈ భారీ ప్రాజెక్టులో నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, ఎల్‌ఆండ్‌టి ఇన్ఫోసిటీ, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ, సైబరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ భాగస్వాములుగా వుంటాయి.
150 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంపై బుధవారం నాడు సంతకాలు జరిగాయి. హైటెక్స్ సిటీలో ఎల్‌అండ్‌టి ఇన్ఫోసిటీ లిమిటెడ్ మెజార్టీ వాటా తీసుకుంటుంది. హైటెక్స్ సిటీలో ఆరు ఎయిర్ కండీషన్డ్ హాళ్లు, ఔట్ డూర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, పార్కింగ్ ఏరియా, కన్వెన్షన్ సెంటర్ వుంటాయి. మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి సమీపంలోవున్న ఇజ్జత్‌నగర్‌లో 110 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications