వ్యాపారిని కాల్చేసిన సిఐ?
ఖమ్మం: ఖమ్మం పట్టణంలో బుధవారం నాడు పట్టపగలు వ్యాపార ప్రముఖుడు మువ్వల తులసీదాస్‌ను పట్టణ సిఐ అన్వర్‌పాషా రివాల్వర్‌తో కాల్చిచంపారు. ప్రమాదవశాత్తు రివాల్వర్ పేలి తులసీదాసు మరణించినట్టుగా పోలీసులు వివరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రత్యక్షసాక్షుల కథనం మాత్రం ఇందుకు భిన్నంగా వుంది.
జిల్లా వర్తక సంఘం మాజీ కార్యదర్శి కూడా అయిన తులసీదాస్‌కు పోలీసులతో కానీ ఇతరులతో కానీ ఎలాంటి గొడవలు లేవని అంటున్నారు. వ్యాపారం పనిమీద హైదరాబాద్‌కు వెళ్లి బుధవారం నాడే తిరిగివచ్చిన తులసీదాస్ సాయంత్రం నాలుగుగంటల ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్లుతుండగా మఫ్టీలో వున్న సిఐ అన్వార్‌పాషా నెంబర్‌ప్లేట్ లేని తెల్లమారుతి కారులో వచ్చి కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పోలీసులను చూడగానే తులసీదాస్ స్కూటర్ ఆపి చేతులు జోడించి నమస్కరించాడని ఇంతలోనే రివాల్వర్‌తో తూటాలు దూసుకురావడంతో నేలకొరిగాడని వారు తెలిపారు. తులసీదాస్ హత్య తర్వాత మఫ్టీలో వున్న పోలీసుల బెదిరింపులతో అక్కడి వ్యాపారులంతా దుకాణాలు మూసివేశారు. తులసీదాస్ మృతదేహాన్ని అదే మారుతీవ్యాన్‌లో వేసుకుని ఖమ్మంలోని క్యూర్
ఆస్పత్రిలో పడవేసి కన్పించకుండ పోయినట్టుగా చెబుతున్నారు. తులసీదాస్ హత్యకు నిరసనగా వ్యాపార సంఘం ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి వరకు రాస్తారోకో జరిగింది. గురువారం నాడు బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ హత్యను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి విచారణ జరిపాల్సిందిగా ఖమ్మం డిఐజిని ఆదేశించినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications