డిఎస్‌సి నాన్‌లోకల్స్‌పై దాడులు
నిజామాబాద్: డిఎస్‌సి 2001దరఖాస్తుల స్వీకరణ సందర్భంలో నాన్ లోకల్ అభ్యర్థులపైదాడులు జరుగుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణపది రోజులుగా జరుగుతోంది. ఏదో రూపంలో నాన్‌లోకల్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతూనేవున్నాయి. నాన్ లోకల్ అభ్యర్థులపై స్థానిక అభ్యర్థులు గురువారందాడులకు దిగడంతో ఈ వివాదం ముదిరి పాకానపడింది. సర్టిఫికెట్లు చించేయడంతో పాటు మూకుమ్మడిదాడులకు పాల్పడడంతో నాన్ లోకల్ అభ్యర్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎటు పడితేఅటు పరుగులు తీశారు.
కొన్ని ఉత్తర తెలంగాణాజిల్లాల్లో 1:1 ప్రకారం కూడా అభ్యర్థులు లేకపోవడంతో ఇతర జిల్లాలకుచెందిన అర్హత కలిగిన ఎంతో మంది అభ్యర్థులుదరఖాస్తులు చేసుకోవడానికి వచ్చారు. దరఖాస్తులుస్వీకరించే అంశంపై మొదట కొంత గందరగోళంనెలకొంది.
దీంతో దరఖాస్తులు డిప్యూటీ డిఇఒకార్యాలయంలో స్వీకరిస్తారని అధికారులుప్రకటించారు. తెలంగాణా నినాదంతో కొందరు, ఇతరకారణాలతో మరి కొందరు ఇతర జిల్లాల వారినిదరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తామని పక్షం రోజులనుంచి హెచ్చరికలు చేస్తూ బ్యానర్‌లు కూడాప్రదర్శిస్తున్నారు. విద్యా శాఖ కార్యాలయం నోటీసుబోర్డుపై నోటీసులు కూడా అతికించారు. వీటిని ఖాతరుచేయకుండా వచ్చిన నాన్ లోకల్ అభ్యర్థులపై గురువారందాడులకు పాల్పడ్డారు. సర్టిఫికెట్లు చించేయడంతో పాటుముష్టిఘాతాలకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications