హురియత్ పై భారత్ - పాక్‌వివాదం
న్యూఢిల్లీఃపాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఈ నెల 14నభారత్ లో జరిపే శిఖరాగ్ర చర్చల సందర్భంగాహురియత్ నేతలతో ఆయన భేటీకావాలనే నిర్ణయం ఉభయ దేశాల మధ్య పెనువివాదానికిదారితీసిింది. ముషారఫ్ రాక సందర్భంగా ఈ నెల14న పాక్ హైకమిషనర్ ఇచ్చే విందుకు హురియత్‌నేతలను ఆహ్వానించాలని పాక్ నిర్ణయించింది.హురియత్ తో ముషారఫ్ భేటీ కావడాన్నిభారత్ బాహాటంగా వ్యతిరేకించింది. వివాదాలకుతావిచ్చే ఇటువంటి చర్యలు మానుకొనిచరిత్రాత్మకమైన చర్చలపై దృష్టిసారించాల్సిందిగా భారత్ హితవు చెప్పింది.
అయితే హురియత్ కు ఆహ్వానం పలకడాన్నిపాక్ సమర్థించుకుంది. గతంలో కూడా హురియత్‌నేతల్ని పాక్ ఆహ్వానించిందని, అదేవిధంగాముషారఫ్ భారత్ వస్తున్న సందర్భంగా వారినిఅహ్వానిస్తామని పాక్ విదేశాంగ ప్రతినిధి రియాజ్‌ఖాన్ శుక్రవారం తేల్చి చెప్పారు.
ఈ ప్రకటనల యుద్ధం ఇలా కొనసాగుతుండగాముషారఫ్ తో చర్చలకు మార్గం సుగమంచేసేందుకు సరిహద్దులో సయమనంపాటించాల్సిందిగా ప్రధాన్ వాజ్ పేయి సైనిక దళాలకువిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications