ఐటిలో ప్రవాసులకే ఎక్కువ ఛాన్స్
న్యూయార్క్: మాంద్యం వల్ల ఉద్యోగాలు తగ్గినా వచ్చే తరం ఐటి కంపెనీల్లో మాత్రం ప్రవాస భారతీయుల హవా సాగడం ఖాయమని అమెరికా స్థిరపడిన ఐటి వ్యాపారులు అంటున్నారు. టెక్నాలజీ పరంగా, ఆర్ధికంగా, లేదంటే మార్కెటింగ్ దృష్ట్యా ఎట్లా చూసినా వచ్చే తరం ఐటి కంపెనీలపై ప్రవాస భారతీయులదే పట్టు అని ఆర్ధిక వేత్త ఆశిష్ అరోరా చెప్పారు.
ప్రస్తుతం తరంలో ఐటి రంగం తనకు కావల్సిన మానవ వనరుల కోసం, నిపుణుల కోసం ఇండియామీద ఆధారపడినా ముందు ముందు ఆ పరిస్థితి వుండదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఇక్కడ అడుగుపెట్టి అనుభవం సంపాదించుకున్నవారి నుంచే కొత్త కంపెనీలకు మేనేజర్లు, మార్కెటింగ్ హెడ్స్, స్ట్రాటెజిస్ట్‌లు లభిస్తారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications