కృష్ణా జిల్లాలో పోలీసులపై ప్రజల దాడి
విజయవాడ : కృష్ణా జిల్లా కూచిపూడి,పెదపూడి రహదారిపై రాస్తారోకో చేస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీలు ఘుళిపించటంతో సహనం కోల్పోయిన ప్రజలు పోలీసులపై తిరగబడి వారిని తీవ్రంగా కొట్టారు. కూచిపూడి బాలిక హాస్టల్‌నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరువిద్యార్ధినులు అదృశ్యం కావటంతో ఆగ్రహించిన ప్రజలుపెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
చుట్టుప్రక్కల గ్రామాలనుంచి వందలాదిగా తరలివచ్చిన ప్రజలు ధర్నా, రాస్తారోకోలకు దిగారు. ట్రాక్టర్లలోపెదం సంఖ్యలో తరలి పచ్చి, ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ జరపటంతో రెచ్చిపోయిన ప్రజలు తిరగబడి పోలీసులను చావచితకగొట్టారు. ప్రజల దాడిలో పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.
విద్యార్ధినులు అదృశ్యమైన హాస్టల్ మేట్రిన్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని, అదృశ్యమైన బాలికల ఆచూకీ తక్షణం కనుగొని బాలికలను వారి తల్లి దండ్రులకుఅప్పగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనలతో కూచిపూడి,పెదపూడి ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనివుంది.












Click it and Unblock the Notifications