ఏకగ్రీవంలోదేశం ముందంజ

హైదరాబాద్‌: స్థానిక సంస్థలఎన్నికల్లో 26 జడ్‌పిటిసి స్థానాలను ఏకగ్రీవంగా చేజిక్కించుకునిఅగ్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసిలలోనూ తనఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 14,514 ఎంపిటిసి(మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం)లకు ఎన్నికలుజరగాల్సి వుండగా వివిధ పార్టీలకు చెందిన 809మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికలకమిషన్‌ గురువారం ప్రకటించింది.తెలుగుదేశం పార్టీ 552 స్థానాల్లో ఏకగ్రీవంగాగెలవగా, కాంగ్రెస్‌ 107 స్థానాల్లో, తెలంగాణా రాష్ట్ర సమితి 32స్థానాల్లో, సిపిఎం, సిపిఐ ఒక్కొక్క స్థానంలోగెలుపొందాయి. తెలుగుదేశం మిత్రపక్షమైన బిజెపి 8స్థానాల్లో, బహుజన సమాజ్‌ పార్టీ ఒకస్థానంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరో 107స్థానాల్లో ఇండిపెండెంట్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలుగుదేశం పార్టీ కర్నూలుజిల్లాలో అత్యధిక స్థానాలను దక్కించుకుంది. మొత్తం 169 ఎంపిటిసిలలో ఆ పార్టీ 138స్థానాల్లో ఏకగ్రీవంగా నెగ్గింది. అత్యల్పంగా కరీంనగర్‌ (1),మెదక్‌ (1), రంగారెడ్డి (1) జిల్లాల్లో ఎంపిటిసిలనుగెల్చుకుంది. జిల్లాలవారీగా చూస్తే టిడిపి ఆదిలాబాద్‌లో 2, అనంతపురంలో 55, చిత్తూరు 13,కడపలో 21, తూర్పుగోదావరిలో 68, గుంటూరులో 34,ఖమ్మంలో 2, కృష్ణాలో 18, మహబూబ్‌నగర్‌లో 2,నెల్లూరులో 12, నిజామాబాద్‌లో 6, ప్రకాశంలో 49, శ్రీకాకుళంలో 75,విశాఖపట్నంలో 11, విజయనగరంలో 3, వరంగల్‌లో 2, పశ్చిమగోదావరిలో 38 ఎంపిటిసిలను ఏకగ్రీవంగాగెల్చుకుంది.

కాంగ్రెస్‌ అత్యధికంగాకర్నూలులో 22 ఎంపిటిసిలను గెల్చుకుంది. అత్యల్పంగాఆదిలాబాద్‌లో ఒకటి, మెదక్‌లో 1, విశాఖపట్నంలో ఒకటిగెల్చుకుంది. జిల్లాలవారీగా ఈ పార్టీ అనంతపురంలో 15, చిత్తూరులో 9,కడపలో 17, తూర్పు గోదావరిలో 5, గుంటూరులో 5,కరీంనగర్‌లో రెండు, కృష్ణాలో మూడు, మహబూబ్‌నగర్‌లో రెండు,నెల్లూరులో మూడు, నిజామాబాద్‌లో రెండు,ప్రకాశంలో ఏడు, శ్రీకాకుళంలో నాలుగు, పశ్చిమగోదావరిలో 8 ఎంపిటిసిలను నెగ్గింది.

తెలంగాణా జిల్లాల్లో తెలంగాణా రాష్ట్ర సమితిఅన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్నది.టిఆర్‌ఎస్‌కు నిజామాబాద్‌లో 20, కరీంనగర్‌లో నాలుగు,మెదక్‌లో ఐదు, వరంగల్‌లో మూడు ఎంపిటిసిలువచ్చాయి. తెలంగాణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ 17 ఎంపిటిసిలను మాత్రమే ఏకగ్రీవంగానెగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+