ఎమిరేట్స్ విమానానికి తప్పినప్రమాదం
హైదరాబాద్: బ్యాంకాక్ నుంచిదుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి గురువారంపెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యంతోవ్యవహరించడంతో 357 మంది ప్రయాణికులు సురక్షితంగాబయట పడ్డారు. విమానంలోని రెండు ఇంజన్‌లలోఒకదానిలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. వీటిని వెంటనేగ్రహించిన పైలెట్ రెండో ఇంజన్‌ను స్టార్ట్ చేసివిమానాన్ని అదుపులోకి తెచ్చారు. గురువారం తెల్లవారు జామున మూడు గంటలకువిమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్పుడువిమానం హైదరాబాద్ మీదుగా పోతోంది.
బేగంపేట విమానాశ్రయం గ్రౌండ్ కంట్రోల్‌యూనిట్‌కు ఎమిరేట్స్ పైలెట్ వైర్‌లెస్ ద్వారాఇంజన్ చెడిపోయిన సమాచారాన్ని అందించారు. విమానం దిగడానికి బేగంపేటవిమానాశ్రయం అధికారులు అనుమతించారు. దీంతోవిమానం సురక్షితంగా ఉదయం మూడున్నర గంటలకు బేగంపేటవిమానాశ్రయంలో దిగింది. ప్రయాణికులు ఉదయంపదకొండున్నర గంటల వరకు విమానాశ్రయంలో విశ్రాంతి తీసుకున్నారు.వీరిలో కొందరిని ప్రతి గురువారం హైదరాబాద్‌నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎమిరేట్స్ విమానాశ్రయంలోపంపించారు. మిగతా వారిని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేకవిమానం తీసికెళ్లింది.












Click it and Unblock the Notifications