తమిళనాడు కొత్త గవర్నర్ షెకావత్?
మద్రాస్: తమిళనాడు కొత్త గవర్నర్‌గా రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి భైరాన్‌సింగ్ షెకావత్‌ను నియమించే అవకాశాలు వున్నాయి. ముఖ్యమంత్రిగా పాలనానుభవంతో పాటు రాజకీయంగా తలపండిన షెకావత్ వంటి వ్యక్తులయితే తమిళనాడు తరహా పరిస్థితులను చక్కగా అదుపు చేయగలరన్న అభిప్రాయంతో కేంద్రనేతలు వున్నారు.
ఫాతిమాబీవీ నిష్క్రమణ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షెకావత్‌ను గవర్నర్‌గా నియమిస్తే రాజస్తాన్‌లో కూడా పార్టీ నాయకత్వాన్ని ద్వితీయ శ్రేణి యువనాయకత్వానికి అందించడానికి అడ్డువుండదన్న అభిప్రాయం కూడా బిజెపి నేతల్లో వుంది. తమిళనాడు గవర్నర్‌గా ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మన్ కెసి పంత్ పేరు మొదటి నుంచి కేంద్ర పరిశీలనలో వుంది. అయితే ప్రణాళిక సంఘంలో పంత్ నిర్వహిస్తున్న పాత్ర, జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రధాన మంత్రి ప్రత్యేక దూతగా ఆయన నిర్వహిస్తున్న పాత్ర దృష్ట్యా పంత్ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టారు.












Click it and Unblock the Notifications