అడ్డుకుంటే అంతం తప్పదు: కెసిఆర్
పెద్దపల్లి : శాంతి యుతంగా ప్రజాస్వామ్య పద్దతులలో సాగుతూవున్న తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారికి పుట్టగతులు ఉండవని టిఆర్‌ఎస అధినేత చంద్రశేఖరరావు హెచ్చరించారు. శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లాపెద్దపల్లిలో జరిగిన టిఆర్‌ఎస్ ఎన్నికల సభలో ప్రసంగించారు. హింకుతావులేకుండా, శాంతియువ పద్దతులలో సాగుతూవున్న తెలంగాణా ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం హింసను ప్రయోగించి అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం హింసాయుత పద్దతులను అవలంభిస్తే ప్రజలు చూస్తూ ఊరకుండరని, తగు విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ మరే పార్టీకి ఓటు వేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని, టిఆర్‌ఎస్‌పడ్డ ఓటు తెలంగాణా రాష్ట్రాన్ని సాధించితీరుతుందని చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా ధ్యేయంగా ఎన్నికలలో పోటీచేస్తున్న టిఆర్‌ఎస్‌ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలంగాణాను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications