టిఆర్‌ఎస్ కు మద్దతు లేదుఃవార్
వరంగల్‌ః తెలంగాణా రాష్ట్రసమితికి పీపుల్స్ వార్ మద్దతు ఇవ్వడం వట్టి మాట అని పీపుల్స్ వార్ నేతలు ప్రకటించారు. వార్ నేతలు శ్యాం, పద్మక్క వరంగల్ జిల్లా అడవుల్లో ఇటీవల విలేకరులతో మాట్లాడారు. చంద్రశేఖర రావు కేవలం రాజకీయ పదవుల కోసమే తెలంగాణా నినాదాన్ని లేవదీశారని నక్సలైట్ నేతలు ధ్వజమెత్తారు. పదవీ వ్యామోహంతోనే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణాకు అన్యాయం చేస్తున్నాయని శ్యాం విమర్శించాడు.
తెలంగాణాకు అన్యాయం చేశే వారు ఏ రాజకీయ పార్టీలో వున్నప్పటికీ తమ టార్గెట్ లను వదిలి పెట్టేది లేదని శ్యాం స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్ళు తాగిన టి.ఆర్.ఎస్ అధినేత చంద్రశేఖర రావును సమర్థిస్తామని వారు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications