అజిత్‌ ఒక్కడికే మంత్రిపదవి

న్యూఢిల్లీ:రాష్ట్రీయ లోకదళ్‌ నాయకుడు అజిత్‌ సింగ్‌ ఆదివారంసాయంత్రం కేంద్ర మంత్రి వర్గంలో చేరారు.ఆయన కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు. ఆయన చేత రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ సరిగ్గా ఆరు గంటలకు రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. మరెవరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలనుదృష్టిలో పెట్టుకుని అజిత్‌ సింగ్‌కు మంత్రిపదవి కట్టబెట్టినట్లు భావిస్తున్నారు. ఆయనను మంత్రివర్గంలో చేర్చుకోవడంపై కొన్ని ఎన్‌డిఎభాగస్వామ్య పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రధానివాజ్‌పేయి ఖాతరు చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసినవెంటనే అజిత్‌ సింగ్‌ మొదట ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రితో కరచాలనంచేశారు. సాదాసీదాగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయి, హోం మంత్రి ఎల్‌.కె.అద్వానీ, ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్‌, తదితరులుహాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+