లాటరీ ద్వారా అధ్యక్ష ఎన్నిక
విజయనగరం:విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడ్ని లాటరీపద్ధతి ద్వారా ఎంపిక చేయాలని రాష్ట్ర ఎన్నికలకమిషన్ నిర్ణయించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకుసమానమైన బలాలు వుండడంతో ఈ అధ్యక్ష ఎన్నికజరపాల్సిన తీరుపై ఎన్నికల కమిషన్ తర్జనభర్జనలుపడింది. చివరికి లాటరీ పద్ధతి ద్వారా ఎన్నికనిర్వహించాలని నిర్ణయించింది.
తమ జడ్‌పిటిసి సభ్యులు జారిపోకుండాతెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. సభ్యుల కోసంవిహారయాత్రలు ఏర్పాటు చేశాయి. అయితే, ఇద్దరుకాంగ్రెస్ సభ్యుల ఎన్నిక చెల్లదంటూతెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. కాంగ్రెస్‌సభ్యులిద్దరు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని ఆ పార్టీఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అనవసరమైన రాద్ధాంతంచేస్తోందని కాంగ్రెస్ అంటోంది.












Click it and Unblock the Notifications