వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి కాలేజీలు-మాంద్యం మహిమ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఐటి బూమ్‌ పుణ్యమా అని హైదరాబాద్‌లో గల్లీకొక్కటిగావెలసిన ఎంసిఎ కాలేజీలు, రాష్ట్రంలోని దాదాపుఅన్ని ప్రధాన కేంద్రాల్లో పుట్టుకువచ్చిన ఇంజనీరింగ్‌కాలేజీలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి.నిన్నటి వరకు పంతుళ్ల కొరత ఇప్పుడు విద్యార్ధులకొరతతో ఈ కాలేజీలు సతమతమవుతున్నాయి.

మొన్నటి వరకుఅమెరికాలో అంతా పచ్చగా వున్నప్పుడు సీట్లకోసంవిపరీతమై కాంపిటీషన్‌ ఈ కాలేజీల్లో కనిపించేది.పాఠాలు చెప్పేందుకు క్వాలిఫైడ్‌ ఫాకల్టీ కోసం మాత్రంఈ కాలేజీల యాజమాన్యాలు నానాతిప్పలు పడాల్సివచ్చేది.ఎంసిఎ కాలేజీల్లోనూ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎలక్ట్రానిక్స్‌,కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్ట్స్‌లో ఈ కొరత తీవ్రంగావుండేది. ఎన్ని అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ఇచ్చినాఏకంగా యుజిసి స్కేళ్ల ఆశ చూపినా సమర్ధులైనఅభ్యర్ధులనుంచి ప్రతిస్పందన నామమాత్రంగానేవుండేది. విధిలేక సగటు జీవులతోనేసరిపెట్టుకోవల్సివచ్చేది. ముఖ్యమైన సబ్జెక్టులకుసంబంధించి నగరంలోని చాలా కాలేజీల్లో కొన్నిబడా ఐటి సంస్థల్లో ఉద్యోగులే పార్ట్‌టైమ్‌ క్లాసులుతీసుకుని భారీ మొత్తంలో పారితోషికం పుచ్చుకునేవారు.

నగరం చుట్టుపక్కలజిల్లాల్లోని కాలేజీలకు కూడా వారే వారంలో ఒకటిరెండు సార్లు వెళ్లి క్లాసులు తీసుకుని వచ్చేవారు.నగరానికి దూరంగా వున్న కాలేజీల పరిస్థితేఅధ్వాన్నంగా వుండేది. అమెరికా నిషా కారణంగా విద్యార్ధులతాకిడి మాత్రం ఈ కాలేజీలకు దండిగానే వుండేది.భారీ ఎత్తున ఫీజులు దండుకుంటూ కాలేజీలయాజమాన్యాలు మాత్రం బాగానే బాగుపడ్డాయి.అయితే అమెరికాలో మాంద్యం వార్తలతో పరిస్థితిఒక్కసారిగా మారిపోయింది. రెండు మూడేళ్ల అనుభవంవున్న వారు కూడా అమెరికా ఆశలు నిరాశ కావడంతోఇప్పుడు టీచింగ్‌ వైపు దృష్టి సారించారు. అనేకకాలేజీలకు ఇప్పుడు ఫుల్‌టైమ్‌ ఫాకల్టీ (చౌకగాకూడా) లభిస్తున్నది. ఒక్కో పోస్టుకు కనీసం పదిమందిపోటీ పడుతున్నట్టుగా చెబుతున్నారు.

అయితే ఇది జంటనగరాలురంగారెడ్డి జిల్లా పరిస్థితి మాత్రమే. ఆదిలాబాద్‌వంటి మారుమూల జిల్లాల పరిస్థితి పూర్తిగాబాగుపడలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిఐటి విద్యను అభ్యసించి ఉద్యోగాలు దొరక్క వున్నవారుహాయిగా ఇంటిపట్టున వుండి ఉద్యోగం చేసుకోవచ్చనిఈ కాలేజీల్లో ఫాకల్టీగా చేరిపోతున్నారు. కానీ మాంద్యంకారణంగా ఈ కాలేజీల్లో సీట్లకు డిమాండ్‌ పూర్తిగాపడిపోయింది.

రాష్ట్రంలో ఇప్పటికే107 ఇంజనీరింగ్‌ కాలేజీలు వున్నాయి. ఇవి కాకుండా కొత్తగామరో 50 కాలేజీలకు అనుమతి లభించింది. పాతకాలేజీల్లో 30, కొత్త వాటిలో 10 జంటనగరాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో వున్నాయి. కాగా 165 ఎంసిఎకాలేజీల్లో 65 కాలేజీలు నగరం, దానిఇరుగుపొరుగు ప్రాంతాల్లో వున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధులు, ఫాకల్టీకూడా కేవలం సిటీ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.అందువల్ల జిల్లాల్లో వెలసిన కాలేజీలు అటువిద్యార్ధులు లేక, ఇటు ఫాకల్టీ దొరక్క బోరుమంటున్నాయి.

కొసమెరుపు
రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు విదేశీ విశ్వవిద్యాలయాలతోటై అప్‌ పెట్టుకుని అట్టహాసంగా ప్రకటించినఎంఎస్సీ ఐటి కోర్సుకు విద్యార్ధులనుంచి ఏ మాత్రంప్రతిస్పందన లేకపోవడంతో కొన్ని విశ్వవిద్యాలయాలుఈ కోర్సులను ఎత్తివేసే ఆలోచనలో వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X