అస్సాంలోనూ జగన్ సీన్: ప్రతిపక్ష హోదా కూడా లేదే!
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పట్టిన గతే, ఇప్పుడు అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి పట్టింది. మెజారిటీ పక్కన పెడితే, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదాను కూడా పొందే అవకాశం లేకుండా పోయింది.
అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం, అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష నాయకుడి పదవి (క్యాబినెట్ హోదా) దక్కాలంటే, ఏదేని ఒక సింగిల్ పార్టీ మొత్తం స్థానాల్లో ఆరో వంతు, అంటే కనీసం 21 స్థానాలను సొంతంగా గెలుచుకోవాలి.

తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం:
బీజేపీ కూటమి తన మిత్రపక్షాలతో కలిసి ఏకంగా 102 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ కూటమి మొత్తం కలిసి 21 స్థానాలు సాధించినప్పటికీ, అందులో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు.. రైజోర్ దళ్ 2, ఏఐయూడీఎఫ్ 2, తృణమూల్ కాంగ్రెస్ 1 సీటు దక్కించుకున్నాయి. కూటమిగా 21 సీట్లు ఉన్నప్పటికీ, నిబంధన ప్రకారం ఏ ఒక్క పార్టీకి 21 సీట్లు లేకపోవడంతో అస్సాం అసెంబ్లీలో ఈసారి అధికారిక ప్రతిపక్ష నాయకుడు ఉండకపోవచ్చు.
ఏపీ - అస్సాం: అచ్చం ఒకేలా..
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ 11 స్థానాలకే పరిమితమై, ప్రతిపక్ష హోదాకు అవసరమైన 18 సీట్లను (మొత్తం 175లో పదో వంతు) సాధించలేకపోయింది. అస్సాంలోనూ కాంగ్రెస్ 19 సీట్ల వద్దే ఆగిపోయి, అవసరమైన 21 సీట్ల మైలురాయిని చేరలేకపోయింది.
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడమే కాకుండా, విపక్షాల ఉనికే లేకుండా చేయడంలో సఫలమైంది. అటు ఏపీలో కూటమి విజయం, ఇటు అస్సాంలో బీజేపీ ప్రభంజనం.. రెండు చోట్లా బలమైన ప్రాంతీయ మరియు జాతీయ పార్టీలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడాల్సిన స్థితికి పడిపోవడం గమనార్హం.














Click it and Unblock the Notifications