వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐఐటి ఫ్రీ సాఫ్ట్‌వేర్‌సెంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ త్వరలోనే ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సెంటర్‌లో ఎంపిక చేసిన ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులను చేపడుతారు. వచ్చే నెల 15న ప్రారంభం కానున్న ఈ కేంద్రం హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు అవసరమైన టెక్నికల్‌ సపోర్టును అందజేస్తుంది.

ఈ విషయం ఐఐఐటి లాంగ్వేజ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంగాల్‌ చెప్పారు. స్వచ్చంద ప్రాతిపదికపై ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులపై పనిచేయడానికి ముందుకువచ్చే నిపుణులకు ఈ కేంద్రం చేయూత నిస్తుందని ఆయన చెప్పారు. తమ కేంద్రంలో తెలుగు, హిందీ, ఇతర భారతీయ భాషలకు సంబంధించిన సిస్టమ్స్‌ను ఉచిత సాఫ్ట్‌వేర్‌గా డెవలప్‌చేసి పంపిణీ చేసినట్టుగా ఆయన తెలిపారు.

ఇంగ్లీష్‌ నుంచి హిందీలోకి అనువాదం చేయడానికి వీలైన సాఫ్ట్‌వేర్‌ను ఈ కేంద్రంలో ప్రస్తుతం డెవలప్‌చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే ఇంగ్లీష్‌-హిందీ ఇ డిక్షనరీని విడుదల చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులకు సత్యం కంప్యూటర్స్‌ ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X