జలపాతంలో 8 మంది గల్లంతు
ఆదిలాబాద్‌ః ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఆరుగురు యువకులు నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలో గల్లంతయ్యారు. మరో ఆరుగురు కూడా గల్లంతు కాగా వారిలో నలుగురిని కాపాడ గలిగారు. ఈత కోసం వెళ్ళిన ఈ యువకులు ప్రవాహం ఉదృతి ఎక్కువగా వుండడంతో కొట్టుకుపోయారు.
బెల్లంపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ చంద్రమోహన్ తన పదిమంది మిత్రులతో కుంటాల జలపాతానికి ఈతకు వచ్చాడు. స్నానం చేస్తుండగా అంతకు ముందు కురిసిన వాన కారణంగా జలపాతం ఒక్క సారిగా ఉగ్రరూపం ధరించింది. దీనితో చంద్రమోహన్ తో సహా ఆరుగురు కొట్టుకుపోయారు.
అదే విధంగా నిర్మల్ మండలం సోన్ గ్రామానికి చెందిన బ్యాంక్ మేనేజర్ కుటుంబం కూడా జలపాతం వద్ద స్నానం చేస్తూ ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఆరుగురు కుటుంబ సభ్యులో నలుగురిని కాపాడ గలిగారు. జలపాతంలో గల్లంతయిన మొత్తం ఎనిమిది మంది కోసం ముమ్మరంగా గాలింపు యత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications