ఉచిత విద్యుత్ పై బాబుకు వైఎస్ లేఖ
హైదరాబాద్‌ః రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నందున రైతులకు తక్షణం ఉచితంగావిద్యుత్ సరఫరా చేయాలంటూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్నికోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకురాశారు. లేఖ ప్రతులను రాజశేఖర రెడ్డి ఆదివారం పత్రికల వారికి విడుదల చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులకు ఒకే ధరకువిద్యుత సరఫరా కావాలనే లక్ష్యంతోనే తాను ఉచితవిద్యుత్ సరఫరాను కోరుతున్నానంటూ డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆ లేఖలోపేర్కొన్నారు.
కోస్తా జిల్లాల రైతులు ఎకరా భూమికి అవసరమైన నీటికోసం 200 రూపాయలు ఖర్చు చేస్తుండగామిగిలిన జిల్లాల ప్రజలు రెండు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈవివక్ష మంచిది కాదని ఆయన చెప్పారు. రాష్ట్ర మంతటా రైతులకుఒకే ధరకు విద్యుత్ సరఫరా చేయలేకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నందున తక్షణం రైతులకు ఉచితవిద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కరవు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగావిఫలం అయిందని వై.ఎస్. నెల్లూరులో ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తే తప్ప కరవు సహాయక చర్యలు చేపట్టలేని స్ధితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వుందని, ఇది సిగ్గుచేటైనవిషయం అని ఆయన దుయ్యబట్టారు.
అంగన్ వాడీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications