రసాయనం తాగిన జోషి
కాంచీపురం: కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఆదివారం నాడు మినరల్ వాటర్ అనుకుని రసాయన ద్రావకాన్ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ సంఘటన కాంచీపురానికి సమీపంలో వున్న ఎనతూర్ లోని శంకర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగింది.
కాలేజీ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జోషి ప్రసంగం మధ్యలో టేబుల్‌పై వున్న గ్లాసులోని నీళ్లను తాగారు. సోడియం హైడ్రాక్సైడ్, సోడియం డ్రైనైడ్, సొలిసిలేట్ కలిపిన ఆ ద్రవం తాగిన వెంటనే ఆయన వాంతులు చేసుకున్నారు. మంత్రి హఠాత్తుగా వాంతులు చేసుకోవడం,అస్వస్థతో ప్రసంగం ఆపివేసి కుర్చీలో కూచోవడంతో సభికులు కంగారు పడ్డారు. అయితే జోషి కుర్చీలో కూచొనే ప్రసంగం పూర్తి చేసి సావనీర్ విడుదల చేశారు. మళ్లీ వాంతులు కావడంతో ఆయన్ను వెంటనే కలెక్టర్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. డాక్టర్ల బృందం పరీక్షించి చికిత్స చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుందని డాక్టర్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications