కల్లోలిత రాష్ట్రంగా కాశ్మీర్‌

న్యూఢిల్లీః హత్యాకాండతో అట్టుడికిపోతున్న కాశ్మీర్‌ ను కల్లోలిత రాష్ట్రంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీ గురువారం అధికారికంగా ఒక ప్రకటన చేస్తారు. కాశ్మీర్‌ లో కొద్ది రోజులుగా పెచ్చుమీరిపోయిన హత్యాకాండపై అద్వానీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కాశ్మీర్‌ లో లఢక్‌ ప్రాంతంలోని రెండుజిల్లాలతో పాటు కార్గిల్‌ ప్రాంతాలను మినహాయించిమిగిలిన ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారు. కాశ్మీర్‌ లో 1958నాటి ఆర్మీ ప్రత్యేథికార చట్టాన్ని పునరుద్ధరించకపోతే పరిస్థితి అదుపులోకి రాదని కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఈ సమావేశంలో తేల్చి చెప్పారు.
పరిస్థితి నానాటికీ దిగజారి పోతుండడంతో కాశ్మీర్‌ ను కల్లోలిత రాష్ట్రంగా ప్రకటించేందుకు ఈ సమావేశంలోఅంగీకరించారు.

దోడా జిల్లాలో 15 మంది అమాయక గ్రామీణులను కిడ్నాప్‌ చేసి ఊచకోత కోసిన సంఘటన జరిగిన వారంరోజుల్లోనే ఈ సంఘటన జరగడంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొన్నది. ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే లష్కర్‌ ఎ తోయిబానే దీనివెనక వున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా జమ్మూస్టేషన్‌ ఊచకోతలను ఆల్‌పార్టీ హురియత్‌ కాన్ఫరెన్స్‌ కూడా తీవ్రంగా ఖండించింది. మానవతావిద్రోహులు మాత్రమే ఇలాంటి దారుణాలకు పాల్పడుతారని హురియత్‌నేతలుపేర్కొన్నారు. కాగా ఊచకోతలకు నిరసనగా వివిధ పార్టీల పిలుపు మేరకు బుధవారం నాడు జమ్మూలో బంద్‌ పాటిస్తున్నారు. బంద్‌ సందర్భంగా మధ్యాహ్నం వరకు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

జమ్మూలో పదిమంది కాల్చివేత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+