ఉదార సాయానికి చంద్రబాబు వినతి
హైదరాబాద్‌ః ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నందున ఉదారంగా సాయంఅందిచాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడువిజ్ఞప్తి చేశారు. కరవు పరిస్థితిపై రెండు రోజుల పాటు వివిధ జిల్లాలలో పర్యటించిన కేంద్ర బృందం అధికారులు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు కేంద్ర బృందంతో గంటకుపైగా సమావేశంమయ్యారు.
రాష్ట్రంలోని 22 జిల్లాలలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు వారికివివరించారు. నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నప్పటికీ పంటలు వేసుకొనేందుకు కూడా ఈ వర్షాలు సరిపోవని ఆయన కేంద్ర బృందానికి చెప్పారు.
ప్రధానమైన రిజర్వాయర్లు నీరులేక ఎండిపోతున్నాయని, పలు జిల్లాలలో ప్రజలకు తాగునీరుకూడా లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి తీవ్రంగానే వున్నదని కేంద్ర బృందం చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. పరిస్థితినిఅంచనా వేసి ఉదారంగా సాయం అందించాల్సిందిగా కేంద్ర బృందానికి చంద్రబాబువిజ్ఞప్తి చేశారు.
కేంద్రబృందంతో దత్తాత్రేయ భేటి
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పర్యటించిన కేంద్ర బృందాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బిజెపి నాయకులతో బుధవారం కలుసుకున్నారు. రాష్ట్రానికి భారీ మొత్తంలో సాయం చేయాల్సిందిగా దత్తాత్రేయ కేంద్ర బృందాన్నికోరారు. ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కరవుతో అల్లాడుతున్న రాష్ట్రంలో పనికి ఆహారం పథకాన్ని డిసెంబర్ వరకు పొడిగించేందుకు చర్య తీసుకుంటామని చెప్పారు.
- కరవు బృందానికి కన్నీటి స్వాగతం
- కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
- వచ్చే వారం కరవు నివేదిక
- వెయ్యికోట్లకు లెఫ్ట్ డిమాండ్
- కరవు మండలాలకు బాబు ప్యాకేజ్












Click it and Unblock the Notifications