సాయంపై పెదవి విప్పని కేంద్రబృందం
హైదరాబాద్‌ః తీవ్రమైన కరవుతో అల్లాడుతున్న ఆంధ్రరాష్ట్రంలో కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన ముగిసింది. కరవుపై వారిఅంచనాలను, చేసే సాయంపై మాత్రం కేంద్ర బృందం గుంభనంగా వ్యవహరించింది. తొమ్మిది మందితో కూడిన కేంద్ర బృందం కె.డి. సిన్హా సారధ్యంలో రాష్ట్రంలో మంగళ, బుధవారాలలో పర్యటించింది. ఆరు జిల్లాలలో కరవు పరిస్థితినిఅంచనా వేసింది.
కర్నూలు, కడప, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది. కేంద్ర బృందాన్ని కరవుతో అల్లాడుతున్న రైతులు నిలిపేసి తమ గోడువినిపించుకున్నారు. తాగేందుకు గుక్కెడు నీళ్ళు కూడా లేవంటూ మహిళలు ఖాళీ బిందెలతో కరవు బృందం ఎదుట ప్రదర్శనలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనను ముగించుకున్న కరవు బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలుసుకుంది.
కరవు తీవ్రత గురించి చంద్రబాబు నాయుడు వారికివివరించారు. నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నప్పటికీవీటివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనంలేదని ఆయన కేంద్ర బృందానికి చెప్పారు. శుక్రవారం కేంద్ర బృందం రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించి సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళుతుంది. ఇది అత్యవసర వ్యవహారం కాబట్టి త్వరలో కేంద్రానికి ఒక నివేదిక సమర్పిస్తామని కేంద్ర బృందంవివరించింది. రాష్ట్రానికి ఎంత మొత్తంలో కరవుసాయం చేస్తారనే విషయాన్ని వెల్లడించేందుకువారు నిరాకరించారు.
- కరవు బృందానికి కన్నీటి స్వాగతం
- కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
- వచ్చే వారం కరవు నివేదిక
- వెయ్యికోట్లకు లెఫ్ట్ డిమాండ్
- కరవు మండలాలకు బాబు ప్యాకేజ్












Click it and Unblock the Notifications