కరవు బృందానికి కన్నీటిస్వాగతం
హైదరాబాద్: రాష్ట్రంలో కరవు పరిస్థితిని అంచనావేసేందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పరిశీలకుల బృందానికి కర్నూలు జిల్లాలో బుధవారం నాడు కన్నీటి స్వాగతం లభించింది. సాగు నీరు పక్కనబెట్టి తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక తామెంత నరకయాతన అనుభవిస్తున్నది వివిధ గ్రామాల్లో ప్రజలు కేంద్ర బృందానికి వివరించారు.
కొన్ని గ్రామాల్లో ప్రజలు ఖాళీ నీటి కుండలతో నిరసన ప్రదర్శన జరిపారు. ఎండిపోయిన చెరువులను, బీళ్లుగా మారిన పొలాలను చూసిన కేంద్ర బృందం పరిస్థితి తీవ్రతకు చలించింది. కరవు తీవ్రతనుఅంచనావేయడంతో పాటు సాయ చర్యలకు ఎంతమొత్తం కావల్సివుంటుందో లెక్కలు వేస్తున్నామని ప్రతినిధులు చెప్పారు. ఆర్ధిక సాయం
కాకుండా ఇంకా ఏ రకంగా కేంద్రం సాయం అందించగలదనేవిషయం కూడా తాము పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications