ఐడిపిఎల్ పై ప్రధానిని కలిసిన ఎర్రం
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో వున్న ఐ.డి.పి.ఎల్. సంస్థ పునరుద్ధరణకు సత్వరం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రం నాయుడు ఐ.డి.పి.ఎల్. కార్మికసంఘ నేతలతో పాటు బుధవారం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రభుత్వం రంగ సంస్థఅయిన ఐ.డి.పి.ఎల్. కష్టాల్లో వున్నదని, దీనిని మూసివేస్తే వందలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని వారు ప్రధానికివివరించారు.
ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఐ.డి.పి.ఎల్. ను ఆదుకోవాలంటూ చేసినవిజ్ఞప్తిని పరిశీలిస్తామని ప్రధాని వాజ్ పేయి హామీ ఇచ్చారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈవిషయాన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఎర్రంనాయుడు బృందానికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications