జమ్మూలో పదిమంది కాల్చివేత
శ్రీనగర్: జమ్మూ రైల్వే స్టేషన్‌లో ఉగ్రవాదులు మంగళవారం నాడు దాడి చేసి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో పదిమంది ప్రయాణికులు మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పటిష్టమైన భద్రత వుండే జమ్మూ స్టేషన్‌పై తీవ్రవాదుల మెరుపు దాడి అధికారులను దిగ్భ్రాంతి పర్చింది.
సంఘటన జరిగిన సమయంలోస్టేషన్‌లో వున్న సాయుధ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక తీవ్రవాది మరణించాడు.సైనిక దుస్తులు ధరించి వచ్చిన సాయుధ తీవ్రవాదులుస్టేషన్‌లోకి దర్జాగా ప్రవేశించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. వాస్తవానికి తీవ్రవాదులుస్టేషన్‌లో రైలు కోసం వేచివున్న సైనిక దళాన్ని టార్గెట్‌గాపెట్టుకున్నారని తెలిసింది. ఈ సంఘటన తర్వాత జమ్మూలో కర్ఫ్యూ విధించారు. పోలీసులుపెద్దఎత్తున గాలింపు ప్రారంభించారు. రాష్ట్రంలో డాక్టర్లు సమ్మెలో వున్నప్పటికీ ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పలువురు ప్రభుత్వ వైద్యులుస్వచ్ఛందంగానే ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులకు వైద్య సాయంఅందజేశారు. జమ్మూ రైల్వే స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. గతంలో ఇదేస్టేషన్‌పై బాంబులతో దాడి జరిపారు.












Click it and Unblock the Notifications