చేతకాని అద్వానీ గద్దెదిగాలిః కాంగ్రెస్
న్యూఢిల్లీః కాశ్మీర్ లో నరమేధం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని కాంగ్రెస్ తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. నైతిక బాధ్యత వహించి కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దోడా జిల్లాలో ఊచకోత సంగతి అటుంచితే మంగళవారం జమ్ము రైల్వే స్టేషన్ లో తీవ్రవాదులు పది మందిని ఊచకోత కోయడంపై సభ అట్టుడికి పోయింది.
లోక్ సభ, రాజ్యసభలలో ప్రతిపక్షాలు ఈఅంశంపై దుమారం సృష్టించాయి. కాశ్మీర్ లో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోతున్నా ప్రభుత్వం మౌనం వహిస్తున్నదంటూవిమర్శించాయి. ప్రతిపక్షాల ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని, కాశ్మీర్ పై సత్వర చర్యలు తీసుకుంటామని అద్వానీ సభలో ప్రకటించారు. అద్వానీ ప్రకటన పట్ల సంతృప్తి చెందని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు కాశ్మీర్ పై రణభేరి మోగించాయి.
తీవ్రవాద పాక్ తో చర్చలెందుకు
భారత్ లో నరమేధం సృష్టించే ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న పాకిస్తాన్ తో చర్చలు జరపడంఅర్థంలేదని బిజెపి
స్పష్టం చేసింది. భారత్-పాక్ అధికారుల స్థాయి సమావేశం గురువారం జరగాల్సి వుంది. వైఖరి మార్చుకోని పాక్ తో చర్చలు వద్దని, తీవ్రవాదాన్ని అణచి వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరింది.












Click it and Unblock the Notifications