వెయ్యికోట్లకులెఫ్ట్ డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం వెయ్యికోట్ల రూపాయల తక్షణ సహాయం అందజేయాలని తొమ్మిది వామపక్షాలు కోరాయి. తొమ్మిది లెఫ్ట్ పార్టీల ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం నాడు కేంద్ర పరిశీలకులను కలసి ఒక వినతి పత్రం సమర్పించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొని వున్న క్షామంతో ప్రజలువిలవిల లాడుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగారైతాంగం పరిస్థితి దయనీయంగా వున్నదని వామపక్షపార్టీల నేతలు తెలిపారు. కరవు పీడిత ప్రాంతాల్లో రుణాలను మాఫీ చేయాలని, ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని వారుకోరారు. అవసరమైతే ఇందుకోసం చట్టాన్ని సవరించాలని వారువిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications