ప్రేమ జంటకు బహిరంగ ఉరి
ముజఫర్‌నగర్: ప్రేమపెళ్లితో నూరేళ్లు పండించుకుందామనుకున్న జంటకు ఈ లోకంలో చోటు లేదని కన్నవారే కసాయివారై ఆ జంటను పరలోకానికి సాగనంపారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా అలీపూర్ గ్రామంలో జరిగింది. బ్రాహ్మణ కులానికి చెందిన 20 ఏళ్లవిశాల్, జాట్ కులానికి చెందిన 18 ఏళ్ల సోను ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమను కుటుంబ సభ్యులే కాకుండా ఊరి ప్రజలు కూడాఅంగీకరించలేదు.
దీంతో ఈ ప్రేమ జంటను ఒక మేడ మీదకు తీసికెళ్లి ఉరి తీశారు. ఈ ఉరి కార్యక్రమాన్ని అమ్మాయి తలిదండ్రులు, అబ్బాయి అన్నయ్య, వదిన తమ చేతులమీదుగా నిర్వహించారు. దీన్ని గ్రామస్థులందరూ సమర్థించారు. హత్యానేరంపై అమ్మాయి తలిదండ్రులను, అబ్బాయి అన్నవదినలనుఅరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు ఛీఫ్ బి.ఎస్. మోరియా చెప్పారు. ఊరంతా ఉద్రిక్తంగా వుండడంతో పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications