వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ప్రమాదంపై సుప్రీ ఆదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని ఏర్వాడి మానసిక రోగుల శరణాలయంలో జరిగిన దారుణ అగ్నిప్రమాదంలో 25 మంది సజీవదహనమైన సంఘటన పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, శరణాలయం అధికారులకు సుప్రీంకోర్ట నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎఎస్‌ ఆనంద్‌ నాయకత్వంలోని అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ నోటీసులను జారీ చేసింది.

కోర్టు రిజిస్ట్రార్‌ సమర్పించిన ఒక నోటును రిట్‌ పిటీషన్‌గా పరిగణిస్తూ న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. ఈ సంఘటనలో మానవహక్కులకు సంబంధించిన ముఖ్యమైనఅంశాలు ఇమిడి వున్నాయని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన వాస్తవవివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా న్యాయమూర్తులు తమిళనాడు ప్రభుత్వాన్ని, శరణాలయం అధికారలను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X