మరో 500 మండలాలకు వెలుగు

హైదరాబాద్‌ః దారిద్ర్య రేఖ దిగువన వున్న నిరుపేదలను ఆదుకొనే లక్ష్యంతో చేపట్టిన వెలుగు పథకాన్ని మరో 500 మండలాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇప్పటికి 108 మండలాల్లో ఈ పథకం అమల్లో వుంది. వెనుకబడిని జిల్లాలకు చెందిన మరో 500 మండలాలను గుర్తించి వెలుగు పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వెలుగు పథకంపురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వెలుగు పథకం కింద ఇప్పటికే 6 లక్షల కుటుంబాలు లబ్దిపొందాయని సమావేశంవివరాలను విలేకరులకు వెల్లడించిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 8 నెలల కిందట తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినవిషయం విదితమే. 550 కోట్ల రూపాయలతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.
ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రపంచబాంక్‌ రెండు వేల కోట్లు రూపాయల ఆర్థిక సాయంఅందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన పోచారం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+