తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్..
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఆర్‌బీ చౌదరి అంటే తెలియని వారు ఉండరు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ పెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ఆయన నిర్మించారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే మే 5 మంగళవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ విచారం వ్యక్తం చేస్తూ ఆర్‌బీ చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఆర్‌బీ చౌదరి కుమారుడు జీవా కూడా హీరోగా రంగం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
అయితే తన తండ్రి మరణ వార్త విన్న జీవా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఫోన్లో తన బంధువులతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు అభిమానుల హృదయాలను పిండేస్తోంది. సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జీవా ఇప్పుడు ఇలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తండ్రి మరణంతో జీవా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాడంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఆర్‌బీ చౌదరి పలు భాషల్లో 90 కు పైగా చిత్రాలు నిర్మించారు. ఆయన కెరీర్ మలయాళ చిత్రాలతోనే స్టార్ట్ చేశారు. అలా 1990 లో కుదువసంతంతో తమిళ ఇండస్ట్రీలో నిర్మాతగా రంగ ప్రవేశం చేశారు. తెలుగు లో ఈయన నిర్మించిన మొదటి చిత్రం సుస్వాగతం.. అలా తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి భారీ సూపర్ హిట్ ఇదే కావడం విశేషం.
ராஜஸ்தானில் கார் விப*தில் உயி**ழந்த தயாரிப்பாளர் ஆர்.பி.சௌத்ரி.. தந்தையின் மறைவால் மனமுடைந்து கண்ணீர் விட்டழுத நடிகர் ஜீவா.!#RBChaudary | #Jiiva | #PolimerNews pic.twitter.com/0IM5rugvvP
— Polimer News (@polimernews) May 5, 2026
ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో సూర్య వంశం సినిమా నిర్మించి మరోసారి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలా శీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. వీటితో పాటు ప్రియమైన నీకు, సింహరాశి, అదృష్టం, శివరామరాజు , లవ్ టుడే, సంక్రాంతి , అందాల రాముడు, అన్నవరం , గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ, మిస్టర్ పెళ్లి కొడుకు , గాడ్ ఫాదర్ వంటి తెలుగు చిత్రాలను నిర్మించి విజయవంతమైన ప్రొడ్యూసర్ గా పేరుగాంచారు.












Click it and Unblock the Notifications