ఇన్ స్టాలో మెసేజ్.. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంటికి పిలిచిన 40 ఏళ్ల మహిళ.. తర్వాత ఏం జరిగింది..?

17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిపై తోటి స్నేహితులు, 40 ఏళ్ల మహిళ దారుణంగా దాడి చేశారు. ఇన్ స్టా గ్రామ్ మెసేజ్ కారణంగా ఈ వివాదం తలెత్తింది. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 40 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఇంటర్ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని ఎర్నాకుళంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిపై ఆ దాడి కేరళలోని ఎడప్పల్లి నార్త్ లోని చంగంపూజా రోడ్డ్ లో ఉన్న మహిళ ఇంట్లో జరిగింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఏం జరిగింది..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల మహిళ కుమారుడు, బాధితుడు టెన్త్ క్లాస్ వరకూ ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఇంటర్ వేర్వేరు కాలేజీల్లో చదువుతున్నారు. అయితే ఈ ఇద్దరూ తమకు తెలిసిన మరికొంతమంది స్నేహితులతో కలిసి ఆన్ లైన్ గేమింగ్ ఆడేందుకు ఇన్ స్టా గ్రామ్ లో కామన్ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఆ యువకుడి ఫోన్ డ్యామేజ్ అయింది. దాంతో గ్రూప్ చాట్స్ కు దూరమయ్యాడు.

అయితే ఇటీవల గ్రూప్ ను ఓపెన్ చేసి చూడగా.. తమ స్నేహితులు ఆ గ్రూప్ నుంచి వేర్వేరు మహిళలకు అసభ్య కరంగా మెసేజ్ లు పంపించినట్లు గుర్తించాడు. ఈ మేరకు తన ఫ్రెండ్స్ ను ఈ విషయంపై నిలదీసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ గొడవను ముగించేందుకు శనివారం రాత్రి తమ ఇంటికి రావాలని స్నేహితుల్లో ఒకరు అడిగాడు. లొకేషన్ ఎలామ్ క్కర అని తెలిపారు. అక్కడికి వెళ్లిన యువకుడిని ఫ్రెండ్స్ ఎడప్పల్లి లోని మరో స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే స్నేహితుడి తల్లితోపాటు మరో ఏడుగురు మైనర్ బాయ్స్ యువకుడిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు ఈ ఘటనను వీడియో తీసినట్లు పేర్కొన్నారు.

Kerala incident Instagram message dispute assault on a 17 year minor a 40-year-old woman arrested

అయితే ఈ ఘటన తర్వాత వెంటనే బాధితుడు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. కానీ అతడి శరీరంపై గాయాలు చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని నిలదీయడంతో అసలు విషయం బయట పెట్టాడు. దాంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఎలామ్ క్కర పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ కేసులో భాగంగా 40 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఏడుగురు మైనర్ బాయ్స్ ను జువెనైల్ హోమ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+