కుమారుడి ఫేస్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు దీపావళి సర్ ప్రైజ్..
బాలీవుడ్ లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీ కపుల్స్ లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంట ఒకరు. కత్రినా కైఫ్ బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లలో ఒగరుగా రాణించారు. హిందీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన కత్రినా.. ఆ తర్వాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్లీశ్వరి 2004లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మల్లీశ్వరి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగులో నటించారు. అదే ఆమె చివరి తెలుగు సినిమా. ఆ తర్వాత హిందీ చిత్రసీమలో పెద్ద స్టార్ గా ఎదిగారు.
ఇక కత్రినా కైఫ్ 2021 లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్నారు. 2021 డిసెంబర్ 9 న వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఇటీవల ఓ బాబు పుట్టిన సంగతి తెలిసిందే. ఇక విక్కీ కౌశల్ మసాన్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2019 లో వచ్చిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ మూవీ ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సర్దార్ ఉద్దమ్ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సామ్ బహదూర్, డంకీ చిత్రాలతో అలరించిన విక్కీ కౌశల్.. 2025 లో వచ్చిన ఛావా చిత్రంతో మరోసారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన మహావతార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో పరశురాముడి పాత్రలో ఆయన నటిస్తున్నారు.

అయితే దీపావళి సందర్భంగా ఈ బాలీవుడ్ స్టార్ జంట తమ ఫ్యాన్స్ కు అద్దిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక వీరి బాబును చూడాలని కోరుకున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఈ మేరకు తొలిసారి తమ ముద్దుల కొడుకు విహాన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
