పండగపూట హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో వైరల్
దీపావళి పర్వదినం వేళ హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తు బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రాకర్స్ మొత్తం పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జనావాసాల్లో ఇలాంటి క్రాకర్స్ దుకాణాలను ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీపావళి పండగపూట సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ భారీ క్రాకర్ షాపు ఇప్పుడు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఎవరో దీపావళి పటాసులు కాల్చుకుంటూ ఉండగా ఓ రాకెట్ ప్రమాదవశాత్తు ఆ టపాసుల షాపులోకి దూసుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా అందులోని క్రాకర్స్ కు మంటలు అలుముకున్నాయి. క్షణాల్లోనే భారీ శబ్దాలతో ఆ దుకాణం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్దమైంది. దుకాణానికి ఆనుకునే విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. కానీ మంటలు వ్యాప్తించకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఇక మంటలను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. కొద్దిసేపటి వరకూ ఆ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీ అగ్నిప్రమాదంసికింద్రాబాద్ సీతాఫల్మండిలోని బాణసంచా దుకాణంలోకి రాకెట్ దూసుకెళ్లడంతో షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, ఎగసిపడ్డ మంటలుఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది https://t.co/EIp1Pu6AmN
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2026
ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చడమంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా చేస్తారు. అయితే టపాసులు కాల్చేటపుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో టపాసులు కాల్చడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రసాయన మిశ్రమాలతో తయారు చేసిన టపాసులు అదుపుతప్పితే భారీ అగ్నిప్రమాదాలకు కారణం అవుతాయని హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు అటు కంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
