విశాఖపై విచారణ కంటితుడుపే
హైదరాబాద్‌ఃవిశాఖలో రక్షణ శాఖకు భూమి కొనుగోలు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా సిఐడివిచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఏలేరు కుంభకోణంపైవిచారణ జరుపుతున్న సోమశేఖర కమిషన్ ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధికె. రోశయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ సోమశేఖర కమిషన్ ను పునరుద్ధరించివిశాఖ భూ కుంభకోణాన్ని కూడా అదే కమిషన్ పరిథిలో చేర్చాలని రోశయ్యకోరారు.
అత్యంత కీలకమైన ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవడంవిచారకరమని ఆయన అన్నారు. కోట్లాది రూపాయలు గల్లంతైన ఏలేరు కుంభకోణంపై నియమించిన సోమశేఖర కమిషన్ ను పునరుద్ధరించకపోతే కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications